Share News

kumaram bheem asifabad- పకడ్బందీగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియ

ABN , Publish Date - Oct 25 , 2025 | 10:26 PM

జిల్లాలోని సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గాల్లో భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్‌, ఇతర అధికారులతో కలిసి శనివారంవీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎన్నికల అధికారులు, ఈఆరోలతో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- పకడ్బందీగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియ
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా

ఆసిఫాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గాల్లో భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్‌, ఇతర అధికారులతో కలిసి శనివారంవీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎన్నికల అధికారులు, ఈఆరోలతో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. 2002 ఎలక్టోరల్‌ జాబితాతో నియోజక వర్గాల వారీగా 2025 ఎలక్టోరల్‌ జాబితా మ్యాపింగ్‌ చేసి నాలుగు కేటగిరీలుగా విభవించామని తెలిపారు. ఇందులో కేటగిరిలో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్‌ జాబితాలో నమోదు కాబడిన వారు కేటగిరి బిలో చేర్చామని అన్నారు. 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు కేటగిరి సీలో ఉంటారని అన్నారు. 1987 నుంచి 2002 మధ్యలో జన్మించిన 2025 ఓటరు జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరి డిలో 2002-2007 మధ్యలో జన్మించిన వారిగా విభజించామని తెలిపారు. అన్ని కేటగిరిలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 3.33 కోట్ల ఓటర్లను మ్యాపింగ్‌ చేయడం జరిగిందని తెలిపారు. మొదట మ్యాపింగ్‌ చేయడిన కేటగిరి ఏ జాబితాను బీఎల్‌ఓ యాప్‌ ద్వారా నిర్ధారించుకోవాలని అన్నారు. తద్వారా ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా పోర్టల్‌లో నమోదు చేయడుతుందని తెలిపారు. అనంతరం కేటగిరి సి, క్యాటగిరి డిలలోని ఓటర్లను కేటగిరి ఏకు మ్యాపింగ్‌ చేయాలని, ఈ ప్రక్రియను ఏఈఆర్‌ఓల ఆధ్వర్యంలో బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు బీఎల్‌ఓ యాప్‌ ద్వారా ప్రక్రియ నిర్వహించేలా చూడాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గాలలో భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. కేటగిరిల వారీగా బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు, సంబంధిత అధికారులతో రివిజన్‌ ప్రక్రియను నిర్వహిస్తామని తెలిపారు. బీఎల్‌ఓలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శిక్షణ అందించి సహాయ ఎన్నికల అధికారి సమక్షంలో రోజు రెండు పోలింగ్‌ కేంద్రాల వివరాలు యాప్‌లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పది రోజుల్లోగా కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎన్నికల పర్యవేక్షకులు శ్యామ్‌లాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 10:26 PM