Share News

గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:55 PM

గణేష్‌ నిమ జ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నామని డీసీపీ భాస్క ర్‌ అన్నారు. గణేష్‌ నవరాత్రులు ముగించుకొని రామగుండం పో లీసు కమిషనరేట్‌ మంచిర్యాల జోన్‌లో వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు. నిమ జ్జనం కోసం తాండూర్‌, మంచిర్యాల, గోదావరిఖని బ్రిడ్జీ వద్ద నిమజ్జనం జరిగే శోభాయాత్ర రూటు మ్యాప్‌ను పరిశీలిం చారు.

గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు
రూటు మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, సీపీ

డీసీపీ భాస్కర్‌

మంచిర్యాలక్రైం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నిమ జ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నామని డీసీపీ భాస్క ర్‌ అన్నారు. గణేష్‌ నవరాత్రులు ముగించుకొని రామగుండం పో లీసు కమిషనరేట్‌ మంచిర్యాల జోన్‌లో వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు. నిమ జ్జనం కోసం తాండూర్‌, మంచిర్యాల, గోదావరిఖని బ్రిడ్జీ వద్ద నిమజ్జనం జరిగే శోభాయాత్ర రూటు మ్యాప్‌ను పరిశీలిం చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరు గకుండా పటిష్టమైన భద్రత, బందో బస్తు ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాల జోన్‌ పరిధిలో వినాయక నిమజ్జనం శోభా యాత్ర బందోబస్తు కోసం ముగ్గురు ఏసీపీలు, 11మంది ఆర్‌ఐ లు, ఎస్‌ఐలు, 28 మంది ఆర్‌ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హెడ్‌కా నిస్టేబుళ్లు 175 మంది మొత్తం మంచిర్యాల జోన్‌ పరిధిలో 2334 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారన్నారు. మంచిర్యాల జోన్‌లో ఎక్కువగా విగ్రహాలు రాయపట్నం బ్రిడ్జి గూడెం, గోదా వరి పుష్కరఘాట్‌ లక్షెట్టిపేట, మంచిర్యాల ప ట్టణం గౌతమేశ్వర ఆలయం టెంపులు కాలేజీరోడ్డు, సీతారాంపల్లి ఇన్‌టెక్‌వెల్‌, ఇం దారం బ్రిడ్జి, చెన్నూర్‌ పె ద్దచెరువు, బెల్లంపల్లి పెద్ద చెరువుల్లో నిమజ్జన కార్యక్ర మానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు, ఫ్లడ్‌లైట్లు, క్రేన్‌లు, ప్లాట్‌ఫాంలు, మంచినీటి వసతితో పాటు నిమ జ్జనం జరిగే ప్రాంతాల్లో గజఈతగాళ్లను ఉంచామన్నారు. సీసీ కెమెరా లు కూడ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 11:55 PM