kumaram bheem asifabad- పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:09 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలోని కల్వాడ, కొండచవెల్లి, చంద్రపల్లి, గెర్రె, ఒడ్డుగూడ, లగ్గాం, దహెగాం గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లకు 40 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని అన్నారు
దహెగాం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలోని కల్వాడ, కొండచవెల్లి, చంద్రపల్లి, గెర్రె, ఒడ్డుగూడ, లగ్గాం, దహెగాం గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లకు 40 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తు ప్రదేశాల్లో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన గోనె సంచులు, టార్పాలీన్ కవర్లు, తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, ఎలకా్ట్రనిక్ తూకం యంత్రాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. రైతులకు తాగునీరు, నీ డ ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఆయన సూచించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి
దహెగాం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం అదనపు కలెక్టర్ పరిశీలించారు. మండలంలోని దహెగాం కల్వాడ, కుంచెవెల్లి, చంద్రపల్లి, గెర్రె, ఒడ్డుగూడ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంచెవెల్లి, కల్వాడ గ్రామాల్లో ధాన్యం ఆరబోయడానికి అనువైన స్థలాలు లేక పోవడంతో అటవీ శాఖ పిధిలోని స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. వరి కోతలు పూర్తి కాగానే ధాన్యాన్ని ఆరబోసి నాణ్యమైన ధాన్యంను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ మునావర్‌షరీఫ్, ఏఆర్ శ్యామూల్, ఎంఆర్‌ఐ నాగభూషణం, సీఈవో బక్కయ్య, జీవన్‌చారి, సాయి ఉన్నారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల స్థలాల దగ్గర రైతులకు సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలోని ఎల్లూరు, గుండ్లపేట, కొండపల్లి వరి కొనుగోలు కేంద్రాల కోసం శనివా రం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పది నుంచి 15 రోజుల్లో రైతులకు పంట చేతికి వస్తుందని వాటికి అనుగుణంగా కొనుగోలు కేంద్రం సిద్దంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మండలంలోని రైస్ మిల్లును తనిఖీ చేశారు. ఆయన వెంట ఆర్‌ఐ రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.