Share News

kumaram bheem asifabad- పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:14 PM

ఆదివాసీల ఆరాధ్యదైవం కుమరంభీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మండలంలోని జోడేఘాట్‌లో కుమరంభీం వర్ధంతిని పురుష్కరించుకొని మంగళవారం ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి హెలిప్యాడ్‌, దర్బార్‌ ఏర్పాట్లను పరిశీలించారు

kumaram bheem asifabad- పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జోడేఘాట్‌లో సభాస్థలిని పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, ఎస్పీ తదితరులు

కెరమెరి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల ఆరాధ్యదైవం కుమరంభీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మండలంలోని జోడేఘాట్‌లో కుమరంభీం వర్ధంతిని పురుష్కరించుకొని మంగళవారం ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి హెలిప్యాడ్‌, దర్బార్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మేరకు పలు సూచనలు చేసి భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పని చేయలన్నారు. అక్టోబరు 7న నిర్వహించనున్న కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జోడేఘాట్‌లో శాశ్వతసభ వేదిక నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. హట్టి నుంచి జోడేఘాట్‌ వరకు అవసరమైన బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రజల సమస్యలను దరఖాస్తులను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. దర్బారులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసుశాఖ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలు, గూడాలలో నివాస గృహల నిర్మాణాలు, తాగునీటి పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అందరి సమన్వయంతో వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్‌, ఈఈ తానాజీ, ఆడిషనల్‌ డీఎంహెచ్‌వో కుడ్మెత మనోహర్‌, డీపీవో భిక్షపతిగౌడ్‌, డీడీ రమాదేవి, భీం మనుమడు సోనేరావు, ఎంపీడీవో అమ్జద్‌పాషా, ఉత్సవ కమిటీ సభ్యులు పెందోర్‌ రాజేశ్వర్‌, రాయిసెంటర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

వేడుకలు ఘనంగా నిర్వహించాలి

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై సంబందిత శాఖల అధికారులతో సమిక్షించారు. వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని శాసనమండలి డిప్యూటి ఛైర్మన్‌ బండ ప్రకాష్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హజరై జాతీయ పతకాన్ని అవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి హజరయ్యే ప్రముఖులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో ఏర్పాట్లను పకడ్బందిగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, సంబందితశాఖల అదికారులు పాల్గొన్నారు.

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి:

సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వైద్యశాఖ అదికారులతో జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నివారణకు చేట్టావలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాడ్‌ వ్యాదులు ప్రబలకుండా వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోజుకు 400కు పైగా వివిద వైద్యసేవల నిమిత్తం రోగులు వస్తుంటారని అందరికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. డెంగీ, మలేరియా, టైఫాడ్‌ పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ కేసులను గుర్తించాలని చిన్నకారణాలతో ఇతర ప్రాంతాలకు రోగులను పంపించడం సరికాదన్నారు. వారికి ఇక్కడే వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగులకు వారికి అందిస్తున్న వైద్య సేవలు పాజిటివ్‌ వచ్చిన కేసులను ప్రతి రోజు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి సీతారాం, వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 11:14 PM