kumaram bheem asifabad- పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:17 PM
తెలంగాణ ఓపెన్‌స్కూల్ సొసైటీ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబందితశాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఓపెన్‌స్కూల్ సొసైటీ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబందితశాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేయాలని ఓపెన్ ఎస్సెస్సీ పరీక్ష నిర్వహణకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఇంటర్ కోసం జన్కాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓపెన్ టెన్త్‌లో 145 మంది అభ్యర్థులు, ఇంటర్‌లో 63 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని అన్నారు. ఈనెల 22 నుండి 28 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయింత్రం 5:30 గంటల వరకు ఉంటాయని తెలిపారు. పరీక్ష సమయానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని తపాలాశాఖ ఆధ్వర్యంలో జవాబు పత్రాలను తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రశ్న, జవాబు పత్రాలను స్థానిక పోలీసు స్టేషన్‌లో భద్రపరచాలని తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్‌బాబు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషారావు తదితరులు పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
తిర్యాణి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని గిన్నెధరి ఆశ్రమ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు ఉపయోగించుకొని భవిష్యత్‌లో ఉన్నత స్థానంలో నిలువలన్నారు. అనంతరం విద్యార్థులను పలు సబ్జెక్టులలో పలు ప్రశ్నలను అడిగి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. వర్షకాలం సీజన్ ఉన్నందున విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో ఉమర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేష్, హెచ్‌ఎం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.