Share News

విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:33 PM

తోటి విద్యార్థుల పై ర్యాగింగ్‌కు పాల్పడితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ కే.శ్రీనివాస్‌ హెచ్చరించా రు.

విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
పాలెంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎస్‌ఐ కే.శ్రీనివాస్‌

- అవగాహన సదస్సులో ఎస్‌ఐ కే.శ్రీనివాస్‌

బిజినేపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : తోటి విద్యార్థుల పై ర్యాగింగ్‌కు పాల్పడితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ కే.శ్రీనివాస్‌ హెచ్చరించా రు. మండలంలోని పాలెంలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశా లలో గురువారం పోలీసు శాఖ ఆ ధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌పై వి ద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. జూనియర్‌ విద్యార్థులను సీనియ ర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ పేరుతో వేధింపులకు గురిచేసిన, గాయపర్చినా యాంటి ర్యాగింగ్‌ యాక్టు ప్రకారం కేసు నమోదు చేస్తే జీవితాం తం బాధపడాల్సి ఉంటుందన్నారు. తోటి విద్యా ర్థులతో స్నేహంగా ఉండాలని కోరారు. కార్యక్ర మంలో ఏఎస్‌ఐ కృష్ణయ్య, కళాశాల వైస్‌ ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ చరణ్‌ తేజ, టీచింగ్‌ అసోసియేట్‌ గాడి పార్వతి, సంతోషిణి, విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 11:33 PM