ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:27 PM
: స్థానిక సంస్థ ఎన్నికల నేపధ్యంలో ఎవరైన ఎన్నికల నియమావళిని అత్రికమిస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డిసీపీ ఎ గ్గడి భాస్కర్ హెచ్చరించారు. శనివారం రాత్రి మండంలోని వెల్గనూర్ గ్రామంలో ప్రజ లకు ఎన్నికలపై అవగాహన కల్పించారు.
మంచిర్యాల డిసీపీ ఎగ్గడి బాస్కర్
దండేపల్లి నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థ ఎన్నికల నేపధ్యంలో ఎవరైన ఎన్నికల నియమావళిని అత్రికమిస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డిసీపీ ఎ గ్గడి భాస్కర్ హెచ్చరించారు. శనివారం రాత్రి మండంలోని వెల్గనూర్ గ్రామంలో ప్రజ లకు ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరు ప్రశాం త వాతావరణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు. ఎవరైన ఓ టర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓటు హ క్కు కలిగిన ప్రతీ ఒకరు స్వేచ్చాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకో వాలన్నారు. ఎన్నికలో ఎలాంటి అవాంనీయ సంఘటనలు జరగకుండా నిష్పక్షపా తం గా శాంతియుతంగా ఎన్నికలు జరిగే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగు తుందన్నారు. శాంతిభద్రత విషయంలో ఎలాంటి రాజీలేదని నిబంధనలు ఉల్లంఘిం చిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పలు అంశా ల పై ప్రజలకు వివరించారు. డిసీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి. దండేపల్లి ఎస్సై తహసీనోద్ధీన్ , పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.