Share News

kumaram bheem asifabad- అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:06 PM

మానవ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. మానవ అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంద్భంగా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

kumaram bheem asifabad- అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
మాట్లాడుతున్న ఏఏస్పీ చిత్తరంజన్‌, పాల్గొన్న సీఐ రవీందర్‌, ఎస్సై అంజయ్య

ఆసిఫాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. మానవ అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంద్భంగా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇటీవల మానవ అక్రమ రవాణా కేసులో 10 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని చెప్పారు. పది రోజుల క్రితం 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. ఇదే కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు నిందితుల కోసం దర్యాప్తు చేయగా శుక్రవారం ఆసిఫాబాద్‌ పట్టణంలోని బస్టాండు ఏరియాలో ఏ7 బపీర్‌ రమేష్‌గౌడ్‌, ఏ9 జగదీష్‌సోనీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్‌ హరిదాసును విధుల్లో నుంచి శాశ్వతంగా తొలగించామని చెప్పారు. జిల్లాలో మానవ అక్రమ రవాణా, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ రవీందర్‌, ఎస్సై అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:06 PM