kumaram bheem asifabad- అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:10 PM
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్‌నగర్ ఈసుగాం పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పెండింగ్ సమస్యలను ఎస్‌హెచ్‌వో అడిగి తెలుసుకున్నారు.
కాగజ్‌నగర్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్‌నగర్ ఈసుగాం పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పెండింగ్ సమస్యలను ఎస్‌హెచ్‌వో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజా ఫిర్యాదును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్క రించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రామానుజం, సిబ్బంది పాల్గొన్నారు.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల కార్మిక వ్యస్థను నిర్మూలించడానికి జూలై నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ -11 ద్వారా అన్ని శాఖల సమన్వయంతో 48 మంది బాల కార్మికులను గుర్తించామని అన్నారు. ఆపరేషన్ ముస్కార్ కార్యక్రమాల ద్వారా తప్పిపోయిన పిల్లలతో పాటు బాలకార్మికలుగా పని చేస్తున్న చిన్నారులను గుర్తించి పునరావాసం కల్పించామని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్-11 ద్వారా జూలై 1 నుంచి 31 వరకు 48 మంది బాల కార్మికులను రెస్క్యూ చేయడం జరిగిందని అన్నారు. వీరిలో ఆసిఫాబాద్ డివజిన్ నుంచి 25 మంది, కాగజ్‌నగర్ డివిజన్‌లో 23 మంది పిల్లలు ఉన్నట్లు తెలిపారు. 18 సంవత్సరా లోపు వారితో పని చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవం తానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.