Share News

Minister Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాకున్నా బిల్లులు జమ

ABN , Publish Date - Sep 20 , 2025 | 04:55 AM

ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాకున్నా పలువురి ఖాతా ల్లో బిల్లులు జమ చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరె...

Minister Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాకున్నా బిల్లులు జమ

  • ఆ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్‌ చేయాలి

  • ఇళ్ల మంజూరుకు కమిటీ సభ్యులు లంచం అడిగితే వెంటనే వారిని తొలగించాలి

  • క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

  • లంచమడిగితే 18005995991 నెంబరుకు ఫోన్‌ చేయండి

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాకున్నా పలువురి ఖాతా ల్లో బిల్లులు జమ చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇళ్లు మంజూరుకాకపోయినప్పటికీ నలుగురి ఖాతా ల్లో నిధులు జమచేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే సస్పెండ్‌ చేసి పూర్తిస్థాయి విచారణ జరిపించాలన్నారు. సూర్యాపేట జిల్లా మధిరాల మండలం పోలుమల్ల గ్రామంలో కొండ లింగయ్య అనే వ్యక్తికి ఇల్లు మంజూరుకు రూ.10వేలు ఇవ్వాలని ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సత్తెయ్య డిమాండ్‌ చేశారని, జనగామ జిల్లా దేవరుప్పల మండలం పడమటి తండాలో శివమ్మ అనే లబ్ధిదారు రూ.30 వేలు ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్యదర్శి డిమాం డ్‌ చేసినట్టు ఫిర్యాదు రాగా విచారణలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడి పాత్ర ఉందనితేలింది. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఇళ్ల మంజూరుకు డబ్బులు డిమాండ్‌ చేసిన ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులను వెంటనే తొలగించాలన్నారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల అంశంపై హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌తో కలిసి మంత్రి సచివాలయం లో సమీక్షించారు. ఈ సందర్భంగా కాల్‌సెంటర్‌కు ఏయే అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయని ఆరా తీసిన ఆయన అధికారులు చెప్పిన వివరాల మేరకు సదరు ఉద్యోగులు, కమిటీల్లోని సభ్యులపై చర్యలకు ఆదేశించారు. మంత్రి మా ట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడి తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమన్నారు. ఇళ్ల మంజూరు కోసం ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు లంచం అడిగితే తక్షణం వారిని తొలగించి, క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని బ్యాంకులు లబ్ధిదారులకు మంజూరైన నిధులను పాతబకాయిల కింద జమచేసుకుంటున్నాయని, దీన్ని సహించేదిలే దని చెప్పారు. ఆధార్‌ నంబరు ఆధారిత చెల్లింపులను దసరాలోగా పూర్తిచేయాలన్నారు. తప్పులను లబ్ధిదారులే స్వయంగా సరిచేసుకునేందుకు రూపొందించిన యాప్‌ ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను తక్షణం ఆయా జిల్లా కలెక్టర్‌, ఎస్పీతోపాటు సచివాలయంలోని తన కార్యాలయానికి పం పాలని అధికారులకు సూచించారు. 18005995991 నంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - Sep 20 , 2025 | 04:55 AM