Share News

Health Commissioner Dr Sangita Satyanarayana: ఫర్టిలిటీ కేంద్రాలపై కొరడా

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:42 AM

నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కొరడా ఝళిపించారు....

Health Commissioner Dr Sangita Satyanarayana: ఫర్టిలిటీ కేంద్రాలపై కొరడా

  • 2 కేంద్రాలు మూసివేత.. పది కేంద్రాల్లో సేవల నిలిపివేత

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కొరడా ఝళిపించారు. 12 కేంద్రాలపై కమిషనర్‌ డాక్టర్‌ సంగీతా సత్యనారాయణ చర్యలు తీసుకున్నారు. రెండు కేంద్రాలను శాశ్వతంగా మూసివేయించారు. మరో 10 కేంద్రాల్లో కొద్దిరోజుల పాటు సేవలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 381 ఫర్టిలిటీ కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు చేసింది. వాటిలో నిబంధనలు పాటించని 50కు పైగా కేంద్రాలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. వివరణపై సంతృప్తి చెందని కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ చర్యలకు ఉపక్రమించింది.

Updated Date - Nov 19 , 2025 | 04:42 AM