High Court: కేసు నమోదైనంత మాత్రాన మెడికల్ కాలేజీపై కఠిన చర్య సరికాదు
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:35 AM
మెడికల్ కాలేజీపై ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన సీట్ల భర్తీకి అనుమతి నిరాకరించడం చెల్లదని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ...
మెడికల్ కాలేజీపై ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన సీట్ల భర్తీకి అనుమతి నిరాకరించడం చెల్లదని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. సీట్ల భర్తీ అనుమతి కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) వద్ద అప్పీల్ చేసుకోవడానికి వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీకి అనుమతి మంజూరు చేసింది. వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ ట్రస్టీ జోసెఫ్ కొమ్మారెడ్డి.. కళాశాల అనుమతుల కోసం మధ్యవర్తుల ద్వారా డాక్టర్ హరిప్రసాద్‌కు వేర్వేరు సందర్భాల్లో రూ.20లక్షలు, రూ.46లక్షలు లంచం ఇచ్చారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో సదరు కాలేజీకి ఈ ఏడాది సీట్ల భర్తీ చేసుకోవడానికి ఎన్‌ఎంసీ అనుమతి నిరాకరించింది. దీనిపై సదరు కాలేజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం.. మెడికల్ కాలేజీపై కఠిన చర్యలు సరికాదని పేర్కొంది.