Share News

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:47 AM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే ప్రభుత్వ పరంగా కఠినచర్యలు ఉంటాయని ఆలేరు ఏడీఏ పద్మావతి అన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
మాదాపూర్‌లో విత్తన విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఏడీఏ పద్మావతి, ఇతర అధికారులు

తుర్కపల్లి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తనాలు విక్రయిస్తే ప్రభుత్వ పరంగా కఠినచర్యలు ఉంటాయని ఆలేరు ఏడీఏ పద్మావతి అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంతో పాటు మాదాపూర్‌ గ్రామంలోని ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువుల నిల్వ రిజిస్టర్ల తనిఖీచేశారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన దుకాణాల్లోనే రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తుర్కపల్లి, మోత్కుర్‌ వ్యవసాయాధికారులు, ఏఎ్‌సఐ ఉన్నారు.

రైతులు రశీదు తీసుకోవాలి

బొమ్మలరామారం : విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తే రైతులు తప్పకుండా రశీదు తీసుకోవాలని ఆలేరు వ్యవసాయ సహాయ డైరెక్టర్‌ పద్మావతి అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలకేంద్రంతో పాటు, చీకటిమామిడి గ్రామాల్లోని ఫర్టిలైజర్స్‌ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలన్నారు. అనంతరం ఫర్టిలైజర్‌ దుకాణాలోని స్టాక్‌ రిజిస్టర్‌, బిల్‌ బుక్స్‌ల రికార్డులను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఏవో దుర్గేశ్వరీ, తనిఖీ బృందం పూజ, కీర్తితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ-పాస్‌ ద్వారానే విక్రయాలు చేపట్టాలి

కొండమల్లేపల్లి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : ఈ-పాస్‌ యంత్రాల ద్వారానే విత్తనాలు, ఎరువులు విక్రయాలు చేపట్టాలని నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల వ్యవయాధికారి వై.జానకిరాములు, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ ఎస్‌కే గౌస్‌ అన్నారు. బుధవారం కొండమల్లేపల్లిలో ఎరువుల దుకాణాలను వారు తనిఖీ చేశారు. ఎమ్మార్పీ ధరలకంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని సూచించారు. తనిఖీల్లో ఏఈఈ సుభాష్‌, హెడ్‌కానిస్టేబుల్‌ నరసింహారెడ్డి, హమీద్‌, ఏఈవోలు నరేష్‌, మల్లేష్‌, డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:47 AM