నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - May 23 , 2025 | 11:18 PM
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తాండూర్ సీఐ కుమారస్వామి పేర్కొన్నారు. శుక్ర వారం నకలీ విత్తనాల నిర్మూలనపై పోలీసులు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో రైతులకు అవగాహన కల్పించారు.
తాండూర్, మే 23 (ఆంధ్రజ్యోతి) : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తాండూర్ సీఐ కుమారస్వామి పేర్కొన్నారు. శుక్ర వారం నకలీ విత్తనాల నిర్మూలనపై పోలీసులు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో రైతులకు అవగాహన కల్పించారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి ఐబీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పత్తి విత్త నాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. నకిలీ విత్తనాలు వాడ డం వల్ల భూమి సారవంతం కోల్పోయి పర్యావరణం కూడా దెబ్బతింటుం దన్నారు. నకిలీలతో మూడు క్వింటాళ్లు అధిక లాభం వస్తుందని ఆశ పడితే పంట నష్టపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం రాద న్నారు. లైసెన్స్ ఉన్న ఫెర్టిలైజర్ దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు, పురు గుల మందులు కొనుగోలు చేయాలన్నారు. కొన్న వాటికి రశీదులు తీసుకో వాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు పా టిస్తే పంట దిగుబడి బాగా వస్తుందని పేర్కొన్నారు. అనంతరం నకిలీ విత్త నాలు వాడవద్దని రైతులు, స్ధానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్ర మంలో ఎంపీడీవో శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారిణి సుష్మ, రైతులు, స్ధానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు పాల్గొన్నారు.