Share News

అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:06 PM

జిల్లాలో అటవీ భూ ములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌ సముదాయంలో అధి కారుల తో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ, అట వీ అధికారులతో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ టీం ఏర్పాటు చేశామన్నారు.

అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అటవీ భూ ములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌ సముదాయంలో అధి కారుల తో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ, అట వీ అధికారులతో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ టీం ఏర్పాటు చేశామన్నారు. అటవీ చ ట్టాలను ఉల్లంఘించి అటవీ భూముల ఆక్రమణకు పాల్పడితే క్రిమినల్‌కేసు లు నమోదు చేసి కటిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని గ్రామాల్లో ఆక్రమణకు గురైన అటవీ భూములకు సంబంధించి ఆక్రమణకు పాల్పడిన వ్యక్తులకు చట్టపరంగా నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్‌, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్‌, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, సీఐలు, తహసీల్దార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 11:06 PM