ఆన్‌లైన్ వేధింపులను ఆపడం సామాజిక బాధ్యత
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:01 PM
టి సమాంలో పిల్లలపై జరిగే ఆన్ లైన్ వేధింపులను ఆపడం అందరి సామాజిక బాధ్యత అని పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మార్క్‌పోలోనియస్ పేర్కొన్నారు.

- పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మార్క్ పోలోనియస్
కొల్లాపూర్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : నేటి సమాంలో పిల్లలపై జరిగే ఆన్ లైన్ వేధింపులను ఆపడం అందరి సామాజిక బాధ్యత అని పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మార్క్‌పోలోనియస్ పేర్కొన్నారు. మంగళవారం శ్రామిక వి కాస కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక పీజీ సెంటర్ లో పిల్లలపై జరిగే ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ క్రైమ్ వంటి వాటి నుంచి తప్పించుకునే మార్గా ల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు, అంగన్ వాడీ ఉద్యోగులకు, గ్రామస్థాయి అధికారులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రిన్సిపాల్‌తో పాటు బాలల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ రావు హాజరై మాట్లాడారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి విలువలతో కూడిన క్రమశిక్షణ నేర్పిం చాలన్నారు. ఏదైనా సైబర్ హాని జరిగితే వెంట నే 1930కి తెలియజేయాలని అన్నారు. ఈ కార్య క్రమంలో పాల్గొన్న వారు వారి సలహాల ను, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మెడి కల్‌ఆఫీసర్ (ఆయుష్) కావ్యశ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ హెచ్‌వోడీ వెంకటేశం, హెల్త్ సూపర్ వైజర్ వెం కటమ్మ, ఎస్‌వీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ తిరు పాల్, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పేరెంట్స్ పాల్గొన్నారు.