KTR Slams Revanth Reddy: కమీషన్లను కాదు.. పాలనను పట్టించుకోండి
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:59 AM
ప్రజా సమస్యలను చర్చించాల్సిన క్యాబినెట్ సమావేశంలో మంత్రులు కమీషన్ల కోసం కొట్లాడటం కాదు.. పాలనా వ్యవహారాలపై దృష్టిపెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్....
ఫ్యూచర్ లేని సిటీ కోసం రేవంత్ అడ్డగోలు ఖర్చు: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను చర్చించాల్సిన క్యాబినెట్ సమావేశంలో మంత్రులు కమీషన్ల కోసం కొట్లాడటం కాదు.. పాలనా వ్యవహారాలపై దృష్టిపెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ పరిధిలోని పలువురు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టెండర్ల నుంచి బిల్లుల విడుదల దాకా రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకుంటూ.. ప్రతి సందర్భంలోనూ కమీషన్ల కోసమే కాంగ్రెస్ మంత్రులు కొట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌తోపాటు రాష్ట్రాభివృద్థి పూర్తిగా కుంటుబడటానికి వారి బాధ్యతారాహిత్య పరిపాలనే కారణమని చెప్పారు. ప్రజలున్న ప్రాంతాలను పక్కనపెట్టి భవిష్యత్తులేని ఫ్యూచర్ సిటీ కోసం అడ్డగోలుగా ఖర్చు పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. కేవలం ఫ్యూచర్ సిటీలోని తమ భూములకు మరింత రేటు వచ్చేలా ప్రజల సొమ్ముతో ఆయన ఇతర కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలను మోసం చేేస ఉద్దేశంతోనే కాంగ్రెస్, బీజేపీలు నాటకాలాడుతున్నాయన్నారు. ఇప్పటికైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ తీసుకువచ్చే ప్రయత్నం బీజేపీ, కాంగ్రె్‌సలు చేయాలని, తమ రాజ్యసభ ఎంపీల ద్వారా పార్లమెంటులో పూర్తి మద్దతిస్తామని చెప్పారు.
పారా అథ్లెట్ అర్చనకు ఆర్థిక సాయం..
అంతర్జాతీయ పారా అథ్లెట్ పోటీల్లో పాల్గొననున్న అర్చనకు ఆర్థిక సాయం చేసేందుకు కేటీఆర్ ముందుకొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన అర్చన శుక్రవారం హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిశారు. వచ్చే డిసెంబరు 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షి్‌పలో మన దేశం తరఫున ఆడేందుకు ఆమె ఎంపికయ్యారు. అర్చన ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని ఆ పోటీల్లో పాల్గొనేందుకు ప్రయాణం, ఇతర ఖర్చులకు ఆర్థిక సాయం అందిస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కాగా జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మౌలానా హాఫిజ్‌పీర్ షబ్బీర్ అహ్మద్‌సాహెబ్ మృతి పట్ల కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆలిమ్-ఎ-దీన్ (మత గురువు), నిస్వార్థమైన నాయకుడిగా చేసిన ేసవలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోదగినవన్నారు.