Share News

BRS MLA Kadiyam Clarifies: బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. పార్టీ మారలేదు

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:58 AM

ఐదుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ శాసనసభ స్పీకర్‌ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు...

BRS MLA Kadiyam Clarifies: బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. పార్టీ మారలేదు

  • స్పీకర్‌కు ఎమ్మెల్యే కడియం వివరణ

వరంగల్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఐదుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ శాసనసభ స్పీకర్‌ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తాను బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదని కడియం స్పష్టం చేశారు. తాను పార్టీ మారానన్నది పచ్చి అబద్ధమన్నారు. ఈ విషయంలో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడియం వివరణ ఇచ్చిన ప్రతిని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానందకు పంపారు.

Updated Date - Dec 18 , 2025 | 02:58 AM