నూతన లైబ్రరీ భవనానికి చర్యలు తీసుకుంటాం
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:14 PM
కల్వకుర్తి ప ట్టణంలో మోడల్ గ్రంథాలయ ని ర్మాణానికి చర్యలు తీసుకుంటామ ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ తెలిపారు.
- కల్వకుర్తి, వెల్దండలో పర్యటించిన గ్రథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేందర్
కల్వకుర్తి/ వెల్దండ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి ప ట్టణంలో మోడల్ గ్రంథాలయ ని ర్మాణానికి చర్యలు తీసుకుంటామ ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ తెలిపారు. కల్వకుర్తి పట్టణంలోని గ్రంథాలయా న్ని మంగళవారం ఆయన పరిశీలించారు. శిథి లావస్థలో ఉన్నగ్రంథాలయాన్ని పరిశీలించి పా ఠకులతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న గ్రంథాల యాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి గ్రంథా లయంతో పాటు వెల్దండ గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరిందని, నూతన భవనాల నిర్మా ణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉప్పునుంతలలో సీఎస్‌ఆర్‌లో గ్రంథాలయ నిర్మాణానికి ముందుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
ఫ వెల్దండలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. నూతన భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయాల సెక్రటరీ శ్యాంసుందర్, నాయకులు యెన్నం భూపతిరెడ్డి, వెంకటయ్యగౌడ్, రషీద్, పుల్లయ్య, పురుషోత్తమాచారి, రమేష్ ఉన్నారు.