Share News

kumaram bheem asifabad- విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు

ABN , Publish Date - Oct 14 , 2025 | 10:12 PM

విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, షెడ్యూల్డ్‌ కులాలు, అధికారులతో బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలో చదివే షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగల విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు

kumaram bheem asifabad- విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా మైనార్టీ అధికారి నదీమ్‌ అహ్మద్‌, ఎస్పీ అభివృద్ధి అధికారి మండల్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, షెడ్యూల్డ్‌ కులాలు, అధికారులతో బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలో చదివే షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగల విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బెస్ట్‌ అవైలబుల్‌ పఠశాలల పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలలో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాలని చెప్పారు. వారికి అందిస్తున్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం, ఇతర మౌలిక వసతులను అమలుపై పాఠశాలలను సందర్శించి పరిశీలించాలని తెలిపారు. సమస్యలు ఉంటే ఆయా పాఠశాలల యజమానులతో చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విద్యా సంవత్సరానికి ఎలాంటి ఆటంకం కలగకుండా కృషి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ వెంకటేష్‌, దోత్రే, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా మైనార్టీ అధికారి నదీమ్‌ అహ్మద్‌, ఎస్పీ అభివృద్ధి అధికారి మండల్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలో భాగంగా ఎంపికైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్‌లతో రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు, సాదా బైనామా దరఖాస్తులు, వివిద అభివృద్ధి పనుల కోసం సేకరించి భూములు, దేవాదదాయ, వక్ఫ్‌, సీలింగ్‌ భూముల వివరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి పనులు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, రహ దారులు, జాతీయ రహదారుల నిర్మాణాలలో ముంపుకు గురైన భూముల వివరాలు, ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్‌, సీలింగ్‌ భూములు, నిషేధిత జాబితాలో గల భూముల వివరాలతో స్పష్టమైన నివేదిక త్వరగా సమర్పించాలని తెలిపారు. భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతీ దరఖాస్తునను రికార్డులతో సరి చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించాఅన్నారు. సంబంధిత వారసులకు, దరఖాస్తుదారుడికి నోటీసులు అందజేయాలని చెప్పాఉరు. దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాదా బైనామా ప్రక్రియలో దరఖాస్తులకు సంబంధిత యజమానులకు నోటీసులు అందించాలని సూచిం చారు. దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Updated Date - Oct 14 , 2025 | 10:12 PM