Share News

kumaram bheem asifabad- అర్హులందరికీ ఇళ్లు అందేలా చర్యలు

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:12 PM

: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని పోతెపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గురువారం సుమారు రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.

kumaram bheem asifabad- అర్హులందరికీ ఇళ్లు అందేలా చర్యలు
ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు

పెంచికలపేట, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని పోతెపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గురువారం సుమారు రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో 17 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు వెటనే ఇంటి నిర్మాణ పనులను మొదలు పెట్టాలని ప్రభుత్వం నాలుగు విడుతలుగా లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ చేస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కమ్మర్‌గాం, మురళీగూడ, తదితర గిరిజన గ్రామాల రోడ్లు దెబ్బతిన్నాయని త్వరలోనే మరమ్మతులు నిర్వహిస్తామన్నారు. వరదల నేపథ్యంలో దెబ్బతిన్న పంటల సర్వే నిర్వహిస్తున్నారని పంట నష్ట పోయిన ప్రతి ఒక్క రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దశల వారీగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆల్బర్ట్‌, ఎస్సై అనీల్‌కుమార్‌, డీటీ చిన్ను, నాయకులు రాజేశ్వర్‌, మహేష్‌, సత్యనారాయణ, నాగేష్‌, గణపతి, నానయ్య, ప్రభాకర్‌, కాంతారావు, పురుషోత్తం, గోపాల్‌, దామోదర్‌, అంజన్న, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 11:12 PM