కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:23 PM
కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండలంలోని గుడిపేట, నంనూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధా న్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
హాజీపూర్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి) : కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండలంలోని గుడిపేట, నంనూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధా న్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ప్రభుత్వం రైతుల వద్ద నుం చి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుం దని, ఈ క్రమంలో రైతుల వద్ద నుంచినాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రాల నిర్వహకులు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం విక్ర యించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల సౌకర్యార్థం తాగునీరు, నీడ, మౌలిక వసతులు కల్పించడంతో పాటు గన్నీ సంచులు, టార్పాలి న్లు, తూకం యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపా యాలు సమకూర్చామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కొను గోలు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. అనంతరం ముల్కల్ల శివారు గోదా వరిలో ఏర్పాటు చేయనున్న ఇసుక రీచ్‌ను తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండేతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారు లు పాల్గొన్నారు.