Share News

kumaram bheem asifabad- మౌలిక వసతుల కల్పనకు చర్యలు

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:21 PM

ఆకాంక్షిత బ్లాక్‌లో భాగంగా జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. న్యూఢిల్లీ నుంచి నీతి అయోగ్‌ సీఈవో రజత్‌కుమార్‌సైని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం జిల్లాలో నీతి అయోగ్‌ కింద చేపడుతున్న ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన అంశాలపై సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల వీసీ మాల్‌ నుంచి కలెక్టర్‌ హాజరయ్యారు.

kumaram bheem asifabad- మౌలిక వసతుల కల్పనకు చర్యలు
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆకాంక్షిత బ్లాక్‌లో భాగంగా జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. న్యూఢిల్లీ నుంచి నీతి అయోగ్‌ సీఈవో రజత్‌కుమార్‌సైని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం జిల్లాలో నీతి అయోగ్‌ కింద చేపడుతున్న ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన అంశాలపై సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల వీసీ మాల్‌ నుంచి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని తిర్యాణి బ్లాక్‌లో నీతి అయోగ్‌లో భాగంగా గిరిజన గ్రామాలలో మౌలిక వసతులు, నైపుణ్యత శిక్షణ, వ్యవసాయ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీతి అయోగ్‌ పథకం ద్వారా మంజూరైన నిధులతో ఆరోగ్యం, న్యూట్రిషన్‌, విద్యారంగంలో వసతుల కల్పన, స్వయం సహయక సంఘాలకు బ్యాంకు రుణాల మంజూరు, మౌలిక వసతుల కల్పన, గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు పూర్తి సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ ఏర్పాటుకు చరలు తీసుకుంటున్నామని చెప్పారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాల నిర్మాణాలు, రైతు వేదికలు, పాఠశాలల్లో కంప్యూటర్లు సమకూర్చడం, మౌలిక వసతులు, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలతో పాటు ఆకాంక్షిత బ్లాక్‌ ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో ట్రైనింగ్‌ డిప్యూటీ కలెక్టర్‌ జాస్తిన్‌ జోల్‌, ఉపగణాంకాధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

సెల్‌ సిగ్నల్‌ సేవలను విస్తరించాలి

ఆసిఫాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారు మూల గ్రామాల్లో సెల్‌సిగ్నల్‌ సేవలను విస్తరిచాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో భారత్‌ సంచార నిగం లిమిటెడ్‌, జియో, ఎయిర్‌టెల్‌ సంస్థల ప్రతినిదులతో సెల్‌ టవర్ల ఏర్పాటు, సిగ్నల్స్‌ విస్తరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మారు మూల ప్రాంతాలకు సిగ్నల్స్‌ అందే విధంగా సేవలను విస్తరించానలి, చాలా గ్రామాలలో పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదని తెలుపుతూ ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, చేయూత పెన్షన్లు, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలకు సిగ్నల్స్‌తో ముడిపడి ఉన్నాయని పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు సిగ్నల్స్‌ సామర్థ్యాన్ని మెరుగు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో కలెక్టరేట్‌ పర్యవేక్షకులు శశిధర్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, ఎయిర్‌టెల్‌ సంస్థల ప్రతినిదులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:21 PM