kumaram bheem asifabad- యూరియా కొరత లేకుండా చర్యలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:10 PM
రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పారు. అదే విధంగా రైతులకు నానో యూరియాపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారికి సూచించారు.
బెజ్జూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పారు. అదే విధంగా రైతులకు నానో యూరియాపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారికి సూచించారు. ఎక్కువగా నానో యూరియా వాడకాన్ని రైతులు పెంచాలని దీంతో భూములు సారవంతంగా మారుతాయని అన్నారు. మొదటి దపాలో యూరియా వేసి రెండో దపాలో నానో యూరియాను మొక్కల మీద పిచికారి చేసినట్లయితే ఆకులు రసాన్ని పీల్చుకొని మొక్కకు బలాన్ని ఇస్తాయన్నారు. రైతులు సొసైటీలో యూరియా సక్రమంగా పంపిణీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రైతులకు కొరత లేకుండా ఇవ్వాలని, అవసరమైన మేరకు ఇండెంట్ పంపించాలని సొసైటీ అధికారులకు సూచించారు. అంతే కాకుండా యూరియా వాడకాన్ని రైతులు తగ్గించి నానో యూరియా వాడకాన్ని పెంచాలని సూచించారు. ఆయన వెంట టెక్రికల్ ఏడీఏ శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి నాగరాజు, ఏఈవోలు మీనా, మారుతి, శ్రీదర్, కార్యదర్శి సత్యనారాయణగౌడ్ ఉన్నారు.