kumaram bheem asifabad- పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:25 PM
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం తుంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మూడో విడత ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం తుంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మూడో విడత ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడు విడతలుగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు సరిపడ ఉండేలా చర్యలు తీసుకోవాలని, విధులు నిర్వహించే సిబబందికి తాగునీరు, అల్ఫాహారం, భోజనం సకాలంలో అందించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ నిర్వహణ, కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బంధీగా చేయాలని అదికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేయాలి
వాంకిడి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సామాఇర పంపిణీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్‌లతో కలిసి పిరశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న సర్పంచ, వార్డు సభ్యుల స్థానాలకు నిర్వహించే ఎన్నికల కోసం సామగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగ కేంద్రం, స్ట్రాంగ్‌రూం, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల్లో వినియోగించే సామగ్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించా రు. కార్యక్రమంలో అధికారులు ఉమర్‌హుస్సేన్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.