సింగరేణి స్థలం కబ్జాకాకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:16 PM
పట్టణంలోని పద్మశాలి వెనుకాల ఉన్న సింగరేణి స్థలం కబ్జాకాకుండా చర్యలు తీసుకో వాలని కోరుతూ శుక్రవారం మందమర్రి ఏరియా జీఎంకు ఏఐ టీయూసీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
బెల్లంపల్లి, అక్టోబరు10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పద్మశాలి వెనుకాల ఉన్న సింగరేణి స్థలం కబ్జాకాకుండా చర్యలు తీసుకో వాలని కోరుతూ శుక్రవారం మందమర్రి ఏరియా జీఎంకు ఏఐ టీయూసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా ఏఐటీయూసీ సెంట్రల్‌వైస్ ప్రెసిడెంట్ స్వామి మాట్లాడుతూ కొందరు సంఘంగా ఏర్పడి సింగరేణి స్థలం కబ్జా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. సింగరేణి స్థలాన్ని సం ఘం పేరుతో కబ్జా చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసు కొని కోట్ల రూపాయల విలువల గల సింగరేణి స్థలాన్ని కాపా డాలని పేర్కొన్నారు. అలాగే సింగరేణి స్థలంలో నిర్మించిన అక్ర మ కట్టడాన్ని పూర్తి స్థాయిలో కూల్చివేసి సింగరేణి ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగాం మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నర్సయ్య, పట్టణ కార్యదర్శి రాజమౌళి, నాయకులు తిరుపతి, రాజేశ్, రత్నం రాజం, ఐలన్న, రమేశ్‌లు పాల్గొన్నారు.