ఈవీఎంల భద్రతకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - May 08 , 2025 | 11:14 PM
జిల్లా కేంద్రం లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ బదావత్ సంతోష్ గు రువారం పరిశీలించారు.
- ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, మే 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రం లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ బదావత్ సంతోష్ గు రువారం పరిశీలించారు. సా ధారణ పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన చేశారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈవీ ఎంల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ అవసర మైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎన్నికల వి భాగం పర్యవేక్షకుడు రవికుమార్, రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు.
సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అర్హత కలిగిన అభ్యర్థులు లైసెన్స్‌డ్ ల్యాండ్ సర్వేయర్ శిక్షణకు ఈ నెల 17వ తేదీ లోపు ద రఖాస్తు చేసుకోవాలనికలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లే ప్రతీ దరఖాస్తుదారుడు సీఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ ద్వారా తెలిపిన తేదీ నుంచి సర్వే, సబ్ డివిజన్ మ్యాప్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంద న్నారు. అర్హత కలిగిన సర్వేయర్లు సరిపడా లేనందున లైసెన్స్ సర్వేయర్లను అర్హత ప్రాతిపదికన ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాల ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. లైసెన్సు సర్వేయర్‌గా ఎంపికైన వారికి జిల్లా కేంద్రంలో ఈనెల 26 నుంచి జూలై26 వరకు రెండు నెలల పాటు (50పని దినాలలో)శిక్షణ ఇవ్వను న్నట్లు తెలిపారు. చిరునామా రుజువుగా ఆధార్ కార్డు కాపీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తహసీ ల్దార్ జారీ చేసిన కులధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. లైసెన్సు సర్వేయర్ కోసం ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈనెల 17వ తేదీ లోపు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.