kumaram bheem asifabad- జంగుబాయి ఆలయ అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 10:16 PM
జంగుబాయి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎంపీ గొడెం నగేష్ అన్నారు. కెరమెరి మండలం కోటపరందోళి గ్రామంలో మంగళవారం నిర్వహించిన జంగుబాయి జాతరలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, యావత్‌మాల్(మహారాష్ట్ర) ఎమ్మెల్యే తోడసం రాజుతో కలిసి ఆలయ క్షేత్రాన్ని సందర్శించారు.
కెరమెరి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జంగుబాయి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎంపీ గొడెం నగేష్ అన్నారు. కెరమెరి మండలం కోటపరందోళి గ్రామంలో మంగళవారం నిర్వహించిన జంగుబాయి జాతరలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, యావత్‌మాల్(మహారాష్ట్ర) ఎమ్మెల్యే తోడసం రాజుతో కలిసి ఆలయ క్షేత్రాన్ని సందర్శించారు. జంగుబాయి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పవిత్రమైన పుష్యమాసంలో జంగుబాయి క్షేత్రంలో నిర్వహిస్తున్న జాతరకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అన్నారు. తదనగుణంగా క్షేత్రంలో జాతర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జంగుబాయి దేవతను భక్తితో కొలుస్తారని, ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా జంగుబాయి దేవత కొలువై ఉందని తెలిపారు. గిరిజనులు తమ సంస్కృతి సందప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పారు. భవిష్యత్‌తరాలకు అందించాలని, వచ్చే రోజుల్లో జంగుబాయి క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. రహదారి సౌకర్యం, ఆలయ క్షేత్రం చుట్టు ప్రహరీ గోడ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాగునీటి వసతి కల్పిస్తామని తెలిపారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జంగుబాయి ఉత్సవాలకు ప్రభుత్వం ద్వారా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు, రహదారి, ప్రహరీ, లైటింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడుతామన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర కలిగిన జంగుబాయి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతామన్నారు. యావత్‌మాల్ ఎమ్మెల్యే రోజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఇరురాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతామన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అంతక ముందు కటోడీలు జాతరకు వచ్చిన అతిథులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సలాం శ్యాంరావు, అధ్యక్షుఓడు జాకు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతి, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.