Share News

Birla Museum: బిర్లా మ్యూజియంలో స్టెగోడాన్‌ జాతి ఏనుగు దంతాల ప్రదర్శన

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:27 AM

నాలుగేళ్ల క్రితం రామగుండం-1 ఏరియాలోని మేడిపల్లి ఓపెన్‌కాస్టు తవ్వకాల్లో దొరికిన లక్షల ఏళ్ల నాటి స్టెగోడాన్‌ జాతి ఏనుగు దంతాల అవశేషాలు...

Birla Museum: బిర్లా మ్యూజియంలో స్టెగోడాన్‌ జాతి ఏనుగు దంతాల ప్రదర్శన

  • 4 ఏళ్ల క్రితం ఓపెన్‌కాస్టు తవ్వకాల్లో గుర్తింపు

  • మ్యూజియంలో సింగరేణి పెవిలియన్‌ ప్రారంభం

హైదరాబాద్‌/గోదావరిఖని/గన్‌పార్క్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల క్రితం రామగుండం-1 ఏరియాలోని మేడిపల్లి ఓపెన్‌కాస్టు తవ్వకాల్లో దొరికిన లక్షల ఏళ్ల నాటి స్టెగోడాన్‌ జాతి ఏనుగు దంతాల అవశేషాలు, డైనోసార్‌ కాలానికి చెందిన శిలాజ కలపను సింగరేణి సంస్థ బిర్లా సైన్స్‌ సెంటర్‌కు అందజేసింది. ఈ మేరకు మ్యూజియంలో ఏర్పాటు చేసిన సింగరేణి పెవిలియన్‌ను శనివారం సింగరేణి సీఎండీ ఎన్‌.బలరాం, బిర్లా పురావస్తు, ఖగోళ, వైజ్ఞానిక సంస్థ చైర్‌పర్సన్‌ నిర్మల బిర్లా ప్రారంభించారు. స్టెగోడాన్‌ జాతి ఏనుగుల మనుగడ 110 లక్షల సంవత్సరాల కిందట ప్రా రంభమై.. 6 వేల ఏళ్ల క్రితం ముగిసింది. నాలుగేళ్ల కిందట మేడిపల్లి ఓపెన్‌కాస్టులో తవ్వకాలు జరుపుతుండగా.. రెండు భారీ ఏనుగు దంతాలు, దవడ ఎముకలు లభ్యమయ్యాయి. ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో లక్షల ఏళ్ల క్రితం సంచరించిన స్టెగోడాన్‌ జాతికి చెందిన ఏనుగు అవశేషాలుగా శాస్త్రజ్ఞులు గుర్తించారు. స్టెగోడాన్‌ ఏనుగులు 13 అడుగుల ఎత్తు, 12.5 టన్నుల బరువుతో ఉండేవని, వీటి దంతాలు 12 అడుగుల పొడవు ఉండేవని విశ్లేషించారు.

Updated Date - Oct 12 , 2025 | 03:27 AM