Share News

kumaram bheem asifabad- మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:33 PM

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు కెరమెరి పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్‌ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

kumaram bheem asifabad- మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
వాలీబాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న ఏఎస్పీ చిత్తరంజన్‌

కెరమెరి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు కెరమెరి పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్‌ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటించాలన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గంజాయి మొక్కలు పెంచడం, సరఫరా చేయడం, నిలువ చేయడం, అమ్మడం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ సత్యనా రాయణ, ఎస్సై మధుకర్‌, ఎంఈవో ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): యువత పెడదారి పట్టకుండా లక్ష్యాలతో ముందుకు సాగాలని ఏఎస్పీ చిత్త రంజన్‌ తెలిపారు. రెబ్బెన మండల స్థాయి వాలీబాల్‌ పోటీలు గోలేటి సింగరేణి క్రీడామైదానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ ఆదేశాల మేరకు ఈ పోటీలను ప్రారంభించామని చెప్పారు. యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ బుద్దె స్వామి, ఎసైక్షౌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 11:33 PM