Share News

ఏకలవ్యుడి విగ్రహాలు ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:24 PM

గురుశిష్యుల బంధాన్ని ప్రపం చానికి చాటిచెప్పిన వ్యక్తి ఏకలవ్యుడని, ఆయన విగ్రహాలను ప్రభుత్వం ద్వారా ఊరూరా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుడు ఉండ్రాళ్ల ఎల్లయ్య డిమాండ్‌ చేశారు. ఏకలవ్యుడి జ యంతిని పురస్కరించుకొని విలేజ్‌ శ్రీరాంపూర్‌లోని చిత్రపటానికి పూ లమాలలు వేసి, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.

ఏకలవ్యుడి విగ్రహాలు ఏర్పాటు చేయాలి
నినాదాలు చేస్తున్న నాయకులు

శ్రీరాంపూర్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : గురుశిష్యుల బంధాన్ని ప్రపం చానికి చాటిచెప్పిన వ్యక్తి ఏకలవ్యుడని, ఆయన విగ్రహాలను ప్రభుత్వం ద్వారా ఊరూరా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుడు ఉండ్రాళ్ల ఎల్లయ్య డిమాండ్‌ చేశారు. ఏకలవ్యుడి జ యంతిని పురస్కరించుకొని విలేజ్‌ శ్రీరాంపూర్‌లోని చిత్రపటానికి పూ లమాలలు వేసి, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎల్లయ్య మాట్లాడుతూ, తెలంగాణకు చెందిన ఎరుకల కులస్తులు తొలి ఏకాదశి రోజున ఏకలవ్య జయంతిని నిర్వహించుకోవాలన్నారు. ప్రభుత్వం ద్వారా అధికారికంగా ఏకలవ్య జయంతి నిర్వహించాలని, స్థలం కేటాయించి ప్రభుత్వమే విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా ఉపాధ్యక్షుడు ఉండ్రాళ్ల అశోక్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉండ్రాళ్ల రవి, నాయకులు జగన్నాథుల మ హేష్‌, దుగ్యాల రవి కుమార్‌, దుగ్యాల సుభాష్‌, జగన్నాథుల మల్లేష్‌, జగంధుల మహేష్‌, ఉండాడి శివ, దుగ్యాల సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 11:24 PM