Share News

Water Project: మూడు ప్రాజెక్టులకు పెట్టుబడి అనుమతిలివ్వండి

ABN , Publish Date - Sep 12 , 2025 | 04:39 AM

రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులకు పెట్టుబడి అనుమతి ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌ కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది...

Water Project: మూడు ప్రాజెక్టులకు పెట్టుబడి అనుమతిలివ్వండి

  • సీడబ్ల్యూసీకి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులకు పెట్టుబడి అనుమతి(ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌) కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. ముక్తేశ్వర్‌(చిన్న కాళేశ్వరం), మొడికుంటవాగు, చనాకా కొరాటాలో డిస్ట్రిబ్యూటరీ పనుల కోసం పెట్టుబడి అనుమతులు ఇవ్వాలని కేంద్ర జలవనరుల సంఘాన్ని(సీడబ్ల్యూసీ) కోరింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు ఇదివరకే సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ ఇవ్వగా.. సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సాంకేతిక అనుమతి కూడా ఇచ్చింది. ఇక ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన(పీఎంకేఎ్‌సవై-ఏఐబీపీ) కింద ఏ ప్రాజెక్టుకు కేంద్ర సహాయం కోరాలన్నా.. సీడబ్ల్యూసీ నుంచి ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌ తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌ కోసం అర్జీ పెట్టుకున్నారు. ఇది రాగానే పీఎంకేఎ్‌సవై కింద కేంద్ర సహాయం కోసం దరఖాస్తు చేసుకోనున్నారు.

Updated Date - Sep 12 , 2025 | 04:39 AM