Share News

Srichaitanya JEE Glory: శ్రీచైతన్య విద్యార్థుల ప్రభంజనం

ABN , Publish Date - Apr 20 , 2025 | 06:17 AM

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు రికార్డు స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఓపెన్‌ కేటగిరీలో వంగాల అజయ్‌ రెడ్డి మొదటి ర్యాంకు సాధించగా, 10లోపు నాలుగు ర్యాంకులు అందుకున్నారు

Srichaitanya JEE Glory: శ్రీచైతన్య విద్యార్థుల ప్రభంజనం

  • జేఈఈ మెయిన్‌లో 10లోపు 4 ర్యాంకులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ఓపెన్‌ క్యాటగిరీలో తమ విద్యార్థి వంగాల అజయ్‌ రెడ్డి ఫస్ట్‌ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించాడని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మశ్రీ శనివారం తెలిపారు. ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరిలో దేవదత్త మాజీ మొదటి ర్యాంకు, తోష్నివాల్‌ శివేన్‌ 9వ ర్యాంకు, సక్షం జిందాల్‌ 10వ ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. ఓపెన్‌ క్యాటగిరీలో 10లోపు 4, వంద లోపు 27, వెయ్యి లోపు 150కి పైగా ర్యాంకులు సాధించడం ద్వారా తమ విద్యార్థులు రికార్డు బద్దలు కొట్టారని వివరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి గత మూడేళ్లుగా 300కి 300 మార్కులు సాధిస్తూ తమ విద్యార్థులు హ్యాట్రిక్‌ సాధించారన్నారు. ఒకే సంవత్సరం మూడు జాతీయస్థాయి పరీక్షల్లోనూ తమ విద్యార్థులు టాపర్లుగా నిలిచారని డైరెక్టర్‌ సుష్మశ్రీ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 20 , 2025 | 06:17 AM