Share News

kumaram bheem asifabad- ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ABN , Publish Date - Aug 16 , 2025 | 10:58 PM

జిల్లాలోని పలు చోట్ల శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహంచారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పలల్లకి సేవ స్థానిక యాదవ సంఘం నుంచి ప్రారంభమై పట్టణ పలు వీధుల మీదుగా కొన సాగింది.

kumaram bheem asifabad- ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో ఉట్టి కొడుతున్న విద్యార్థులు

కాగజ్‌నగర్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు చోట్ల శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహంచారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పలల్లకి సేవ స్థానిక యాదవ సంఘం నుంచి ప్రారంభమై పట్టణ పలు వీధుల మీదుగా కొన సాగింది. వేడుకలను పురస్కరించుకుని శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ పట్టణంలోని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు నివాసంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, సంతోష్‌, మల్లేష్‌, శ్రీనివాస్‌, వెంకటేష్‌, భీమేష్‌, బలరాం, మల్లేష్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండల కేంద్రంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదవ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. హనుమాన్‌ ఆలయ ఆవరణలో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు శంకర్‌, సుచిత్‌, దీపక్‌ముండే తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి):మండలంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆలయలలో ప్రత్యేక పూజలు చేశారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను మండల ప్రజలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 24 గంటల పాటు ఎక్కాహం నిర్వహించారు. శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని పలు వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. కర్జల్లి ఓంకార ఆశ్రమంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయాల్లో అన్నదానం నిర్వహించారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని శివకేశవ ఆలయ ప్రాంగణంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కాహం నిర్వహిం చారు. మండల కేంద్రంలోని అంగడిబజార్‌ ఏరియాలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమంలో ఏడు జట్లు పాల్గొనగా విజేతలకు ఎస్సై విక్రమ్‌ నగదు పారితోషికం( బహుమతులు)అందజేశారు. క్యాక్రమంలో నిర్వహకులు పాల్గొన్నారు.

కౌటాల(ఆంధ్రజ్యోతి): కౌటాల మండలంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో ఎక్కాహం భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు వీధుల్లో, ఆలయ ప్రాంగణాల్లో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - Aug 16 , 2025 | 10:58 PM