SSC Results: ఏపీ పదోతరగతి ఫలితాల్లో శ్రీచైతన్య విజయ దుందుభి
ABN , Publish Date - May 25 , 2025 | 04:00 AM
ఆంధ్రప్రదేశ్ పదోతరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా టాప్ ర్యాంకులు రావడం గర్వకారణంగా నిలిచింది.

హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే పదోతరగతి ఫలితాలు ప్రకటించగా రీవాల్యుయేషన్‌లో తమ విద్యార్థులు 599 మార్కులు సాధించారని శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు. ఏడుగురు విద్యార్థులు 598 మార్కులు సాధించగా, 42 మంది 597, 109 మంది 596, 201 మంది 595, 1184 మంది 590 మార్కులు సాధించారని శనివారం ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. మొత్తం 24261 మంది విద్యార్థులకుగాను గరిష్ఠ మార్కులు 600కి 528 సగటు మార్కులు సాధించారన్నారు. ఇటీవలే విడుదలైన జేఈఈ మెయిన్స్‌లోనూ ఓపెన్ విభాగంలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించడంతోపాటు 100లోపు 19 ర్యాంకులు సాధించారని సీమ తెలిపారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..