Sri Chaitanya Staff Donate Blood: శ్రీచైతన్య ఉద్యోగుల రక్తదానం
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:22 AM
శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకల సందర్భంగా సంస్థ ఉద్యోగులు రక్తదానం చేశారు...
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకల సందర్భంగా సంస్థ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ వేడుకలు గురువారం దేశవ్యాప్తంగా అన్ని శ్రీచైతన్య కాలేజీల్లో జరిగాయి. మొత్తం 3,127 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మియాపూర్‌లోని క్యాంప్‌సలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ పాల్గొని చైర్‌పర్సన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగులు రక్తదానం చేయడంపై అభినందించారు. దేశవ్యాప్తంగా రక్తం కొరత తీవ్రంగా ఉందని, ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా లక్షలాది మంది విద్యార్థులను ఐఐటీయన్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, సివిల్ సర్వెంట్లుగా తీర్చిదిద్దడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. విజయవాడలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని శ్రీచైతన్య డైరెక్టర్ టి.నాగేంద్రకుమార్ ప్రారంభించారు.