Global University Rankings: ఎస్సార్‌యూకు ప్రపంచ స్థాయి గుర్తింపు
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:04 AM
ఎస్సార్ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ది) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026లో 801 1000 బ్యాండ్‌లో స్థానం సంపాదించిందని....
ది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026లో చోటు
వివరాలు వెల్లడించిన ఎస్సార్‌యూ చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి
హసన్‌పర్తి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఎస్సార్ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ది) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026లో 801-1000 బ్యాండ్‌లో స్థానం సంపాదించిందని ఆ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి తెలిపారు. ఇది తెలంగాణకు గర్వకారణమన్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లోని ఎస్సార్ విశ్వవిద్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. దేశంలోనే అనతికాలంలో గ్లోబల్ ర్యాంకింగ్‌లో చోటు దక్కిన ఏకైక విశ్వవిద్యాలయంగా ఎస్సార్‌యూ గుర్తింపు పొందిందన్నారు. ఇటీవల వెలువడిన ఎన్‌ఐఆర్‌ఎఫ్-2025 ర్యాంకింగ్స్‌లోనూ ఎస్సార్ వర్సిటీ ఇంజనీరింగ్ విభాగంలో 91వ స్థానం, విశ్వవిద్యాలయం విభాగంలో 101-105 బ్యాండ్‌లో నిలిచిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఈ స్థిరమైన ప్రదర్శన, విద్యాప్రామాణికత, పరిశోధన, నాణ్యమైన బోధన పట్ల ఎస్సార్‌యూ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ది) ర్యాకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయ ప్రదర్శనను అంచనా వేయడానికి అత్యంత విశ్వసనీయమైన ప్రమాణాలుగా పరిగణించబడుతాయని చెప్పారు. ఎస్సార్ దేశంలో టాప్-28, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 10వ స్థానం, తెలంగాణలో టాప్ 100లో చోటు దక్కించుకుందని తెలిపారు. వీసీ దీపక్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ ర్యాంకింగ్ ఎస్సార్‌యూ బలమైన విద్యాప్రాతిపదిక, అంతర్జాతీయ దృష్టి కోణానికి నిదర్శనమన్నారు.