kumaram bheem asifabad- క్రీడా ప్రాంగణాలు.. నిరుపయోగం
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:21 PM
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు ఆడుకోవడాని కి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భా టంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితమయ్యాయి.
- పట్టించుకోని అధికారులు
కాగజ్‌నగర్ టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు ఆడుకోవడాని కి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భా టంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితమయ్యాయి. ఒక్కో మైదానానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. గత బీఆర్‌ఎస్ పాలనలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో నిధులు వెచ్చించి ఏర్పాటు చేశారు. క్రీడలకు అనుకూలంగా లేని చోట్లనే చాలా వరకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామా ల్లో, పట్టణాల్లోనూ ఆయా ప్రాంగణాల్లో క్రీడలు జరగకపోవడం లేకపోగా కేవలం మైదానాల్లో గడ్డి మొలు స్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ గ్రామ పంచాయతీకి, పట్టణ ప్రాంతాల్లో ప్రతీ వార్డుకు ఒకటి చొప్పున అధికా రులు వీటిని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.
- నిర్వహణ లోపం..
క్రీడా ప్రాంగణాల నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం పట్టించు కోకపోవడం, అధికారులు గాలికి వదిలే యడంతో అనేక చోట్ల కేవలం నామమాత్రంగా తయారయ్యాయి. పలు చోట్ల పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధా మాలు నిర్మించారు. లక్షలాది రూపాయల నిధులు వెచ్చించినప్పటికీ కొన్ని చోట్ల అవి కేవలం పశువులకు ఆవాసాలుగా మారిపోయాయి. మరి కొన్ని చోట్ల వర్షాల కు బురదమయంగా మారాయి. కాగజ్‌నగర్ మండలం లోని గ్రామ పంచాయతీలతో పాటు పట్టణంలోని ఆయా వార్డుల్లో క్రీడా మైదానాలు, పల్లె ప్రకృతి వనాలు చెత్తాచెదారం పెరిగిపోయి కళవిహీనంగా మారాయి. కొన్ని చోట్ల ఊరికి దూరంగా ఉండడంతో వాటిని ఉపయోగిం చుకోలేదని పరిస్థితి నెలకొంది.
ఇలా చేస్తే ఉపయోగం..
క్రీడా ప్రాంగణాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకో వాలి. క్రీడలకు అవసరమైన పరికరాలు, వసతులు కల్పిం చేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. క్రీడా ప్రాంగ ణాలను స్థానికుల అవసరాలకు అనుగుణంగా ఉపయో గించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. కొన్ని చోట్ల క్రీడా ప్రంగాణాలు ఏర్పాటు చేసిన భూములు వివాదాస్ప దంగా మారినందున అధికారులు పరిష్కరిస్తే క్రీడాకారు లు తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు అవ కాశం ఉంటుంది.