Share News

kumaram bheem asifabad- ఎస్పీఎంలో ‘గుర్తింపు‘ ఎప్పుడు..?

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:19 PM

కుమరం జిల్లాలోనే అతి పెద్ద కాగితపు పరిశ్రమలో ట్రేడ్‌ ఎన్నికల ప్రక్రియ కళగానే మిగిలింది. ఎస్పీఎం పునరుద్ధరణ జరిగి ఏడేళ్లు గడుస్తున్నా ఎన్నికలు జరుగక పోవడంతో కార్మికుల్లో అసంతృప్తి నెలకొంది. యాజ మాన్యం, లేబర్‌ శాఖ మధ్య సమన్వయం లేక పోవడంతో కార్మిక హక్కులు పూర్తిగా నిలిచి పోతున్నాయని పలువురు చెబుతున్నారు.

kumaram bheem asifabad- ఎస్పీఎంలో ‘గుర్తింపు‘ ఎప్పుడు..?
ఎస్పీఎం కార్యాలయం

- పట్టించుకోని లేబర్‌ అధికారులు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కుమరం జిల్లాలోనే అతి పెద్ద కాగితపు పరిశ్రమలో ట్రేడ్‌ ఎన్నికల ప్రక్రియ కళగానే మిగిలింది. ఎస్పీఎం పునరుద్ధరణ జరిగి ఏడేళ్లు గడుస్తున్నా ఎన్నికలు జరుగక పోవడంతో కార్మికుల్లో అసంతృప్తి నెలకొంది. యాజ మాన్యం, లేబర్‌ శాఖ మధ్య సమన్వయం లేక పోవడంతో కార్మిక హక్కులు పూర్తిగా నిలిచి పోతున్నాయని పలువురు చెబుతున్నారు. ఎన్నికలు జరుగక పోవడంతో యూనియన్‌ వ్యవస్థ నిర్వీర్యమై వేతన సవరణలు భద్రతా సదుపాయాలు, సంక్షేమ నిధులు, పదోన్నతులు వంటి అంశాలు పెండింగ్‌లోనే ఉంటున్నా యి. మిల్లు తిరిగి ప్రారంభమైనా కార్మికుల సమస్యలు మాత్రం లేబర్‌ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీఎంలో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని, కార్మికుల ప్రతినిధి వ్యవస్థను వెంటనే పునరుద్ధరించేలా చూడాలని కోరారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సిర్పూరు ఎమ్మెల్యే హరీష్‌ బాబు సిర్పూరుపేపర్‌ మిల్లులో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వెంటనే ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాలని ప్రస్తావించా రు. ఇంత జరిగినా లేబర్‌ అధికారులు ఈ విషయంలో ఇంత వరకు చర్యలు తీసుకోవడం లేదు. 2014లో మిల్లు పునరుద్ధరణ తర్వాత ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహిస్తారని భావించిన కార్మికుల ఆశలు అడియాశలవుతున్నాయి.

ట్రేడ్‌ యూనియర్‌ ద్వారా..

యాజమాన్యం, ట్రేడ్‌ యూనియన్‌ ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంది. అయితే ట్రేడ్‌ యూనియన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని, ఆరు నెలల క్రితం ట్రేడ్‌ యూనియన్‌ సంఘాల వివరాలు పంపించాలని ఆదిలాబాద్‌ లేబర్‌ అధికారి ఇక్కడి వారికి నోటీసులను పంపించారు. ఇందుకు ఎనిమిది ట్రేడ్‌ యూనియన్‌ సంఘాల నాయకులు పూర్తి వివరాలు సమర్పించారు. అయినా కూడా ఇంత వరకు ఎలాంటి పురోగతి లేక పోవటంతో కార్మికులు లేబర్‌ అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహణ జరిగితే కార్మికుల సమస్యలు, పెండింగ్‌ బిల్లులు, తదితర అంశాలపై నేరుగా యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించుకునే అవకాశాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు. గత నాలుగు రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లోని ప్రిన్సిపాల్‌ సెక్రటరి దాన కిషోర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఎస్పీఎంలో కార్మికులు సమస్యలు, ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికల ఆవశ్యకతపై వివరించారు. దీనిపై కూడా సెక్రటరి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికైనా లేబర్‌ అధికారులు ఈ దిశగా స్పందించి ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు ముక్త కంఠంతో డిమాండు చేస్తున్నారు.

ఎన్నికలు వెంటనే నిర్వహించాలి..

- ఓదెలు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు

ఎస్పీఎం వెంటనే ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాలి. కార్మికులకు, యాజమాన్యానికి మధ్య వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ట్రేడ్‌ యూనియన్‌ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో ఎన్నికలు పూర్తిగా జరిగాయి. కాని ఎస్పీఎం మిల్లులో ఇంత వరకు జరుగడం లేదు. ఇప్పటికైనా కార్మిక శాఖ అధికారులు స్పందించి ఎన్నికలు నిర్వహించాలి.

Updated Date - Oct 18 , 2025 | 11:19 PM