Share News

Split in New Democracy: న్యూడెమోక్రసీలో మరో చీలిక

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:15 AM

సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ మరో చీలికవైపు పయనిస్తోంది. రెండేళ్లుగా కేంద్ర కమిటీ కార్యదర్శిగా చంద్రన్న నాయకత్వంలో సాగుతోన్న..

Split in New Democracy: న్యూడెమోక్రసీలో మరో చీలిక

  • చంద్రన్న వర్గంలో తిరుగుబాటు

  • రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ వర్గంలో పలువురి రాజీనామా

ఇల్లెందు, ఆగ స్టు 18 (ఆంధ్రజ్యోతి) : సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ మరో చీలికవైపు పయనిస్తోంది. రెండేళ్లుగా కేంద్ర కమిటీ కార్యదర్శిగా చంద్రన్న నాయకత్వంలో సాగుతోన్న న్యూడెమోక్రసీలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయన నాయకత్వంలో చంద్రన్న వర్గానికి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం పలువురు ప్రకటించారు. తాము మూకుమ్మడిగా చంద్రన్న వర్గాన్ని వీడుతున్నామని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీగానే కొనసాగుతామని అశోక్‌ ప్రకటించారు. ఇప్పటికే కొన్నేళ్లుగా న్యూడెమోక్రసీలో జరిగిన పరిణామాలతో న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం, మాస్‌లైన్‌, న్యూడెమోక్రసీ యతీంద్ర కుమార్‌ వర్గాలుగా చీలిపోయారు. అశోక్‌ నాయకత్వంలో మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో సోమవారం వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు సమావేశమై కేంద్రకమిటీ కార్యదర్శి చంద్రన్న వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం గమనార్హం.

Updated Date - Aug 19 , 2025 | 04:15 AM