Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:27 PM

ఇందిరమ్మ ఇ ళ్ల నిర్మాణ పనులను వేగవంత మయ్యేలా చూడాలని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతున్న రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌

- హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ - రఘుపతిపేటలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

కల్వకుర్తి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇ ళ్ల నిర్మాణ పనులను వేగవంత మయ్యేలా చూడాలని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ కోరారు. ఇందిర మ్మ మోడల్‌ హౌస్‌ ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు జరిగితే లబ్ధి దారులకు ఆర్థికభారం ఉండద ని, నిబంధన ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలని సూ చించారు. మండలంలోని రఘు పతిపేట గ్రామంలో ఇళ్లనిర్మాణ పనులను మం గళవారం ఎండీ పరిశీలించారు. ఇల్లు నిర్మించు కుంటున్న లబ్ధిదారులను వివరాలు అడిగి తెలు సుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఎలాం టి అవకతవకలు జరిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎండీ వెంట హౌసింగ్‌ పీడీ సంగప్ప, హౌసింగ్‌ డీఈ హర్యనాయక్‌, ఎంపీడీవో ఎన్‌.వెంకట్రా ములు, పంచాయతీ కార్యదర్శి భారతమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 11:27 PM