Minister Adluri Lakshman: వారంలో గురుకులాల టైం టేబుల్ మార్పు
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:57 AM
గురుకుల విద్యా సంస్థలకు ప్రత్యేక టైం టేబుల్ ప్రకటిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. గతంలో గురుకులా..
ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి విజ్ఞప్తిపై మంత్రి లక్ష్మణ్ స్పందన
హైదరాబాద్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యా సంస్థలకు ప్రత్యేక టైం టేబుల్ ప్రకటిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. గతంలో గురుకులాల టైంటేబుల్ ఉదయం 9 గంటల నుంచి ఉండేదని, ఇప్పుడు 8 గంటల నుంచే మొదలుకావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మంత్రిని కలిసి.. గురుకులాలన్నింటికీ ఒకే సమయం ఉండటంతో ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు. ఉ దయం 8గంటలకే తరగతులు ప్రారంభమవుతుండటంతో అనేక మంది విద్యార్థులు అల్పాహారం తినకుండానే తరగతులకు హాజరుకావాల్సి వస్తోందన్నారు. అన్ని గురుకులాలకు ఒకే సమయం కాకుండా.. బీసీ, ఎస్టీ, గిరిజన, మైనారిటీ గురుకులాలకు వేర్వేరు టైం టేబుల్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటును ఆయా గురుకులాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి లక్ష్మణ్.. సీఎస్ రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడారు. దీనిపై వారంలోపు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.