యాదగిరిగుట్టలో శివకేశవులకు విశేష పూజలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:59 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి.
యాదగిరిగుట్టలో శివకేశవులకు విశేష పూజలు
యాదగిరిగుట్ట, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభు స్వామి,అమ్మవారికి వైష్ణవ పాంచరాత్రాగమరీతిలో, శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామివారి శివాలయంలో స్పటికమూర్తులకు శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంకర్యాలు నిర్వహించా రు. ప్రధానాలయంలో సుప్రభాత సేవతో స్వామిఅమ్మవార్లను మేల్కొలిపిన అర్చకు లు మూలమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అ లంకరించిన పూజారులు విష్వక్సేనుడికి తొ లిపూజలు చేపట్టి సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. శివాలయంలోని ముఖమండపంలో స్పటికమూర్తులకు అర్చకులు మంగళవాయిద్యాల మధ్య పం చామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు.
15న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిషనర్, ఈవో ఎస్. వెంకట్రావు తెలిపారు. యాదగిరికొండపై సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన కొండకింద సత్యదేవుని 2వ వ్రత మండపంలో ఉదయం 11 గంటలకు ఉచిత వ్రతాల నిర్వహణకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సామూహిక వ్రతాల్లో పాల్గొనే వారు వ్రత మండపం కార్యాలయం వద్ద ఈ నెల 13న సాయంత్రం 5 గంటల వరకు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఎలాంటి రుసుము లేకుండా పూజ సామగ్రితో ఉచితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, మరిన్ని వివరాల కోసం వ్రత మండపం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు..
ప్రధానార్చకుడిగా సురేంద్రచార్యులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకుడిగా భట్టర్ సురేంద్రచార్యులు నియమితులయ్యారు. ఇప్పటికే ప్రథమ ప్రధానార్చకుడిగా కాండూరి వెంకటాచార్యులు కొనసాగుతుండగా సోమవారం ద్వితీయ ప్రధానార్చకుడిగా భట్టర్‌ను నియమిస్తూ ఆలయ ఈవో వెంకట్రావు ఉత్తర్వులు జారీ చేశారు. 1992సంవత్సరంలో దేవస్థానంలో అర్చకవృత్తిని స్వీకరించి 33 ఏళ్లుగా స్వామిఅమ్మవార్లకు పలు రకాల సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు ఉపప్రధానార్చకుడి హోదాలో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం ప్రధానార్చకుడిగా నియమితులు కాగా అర్చకులు శుభాకాంక్షలు తెలిపారు. గత నెల 31న ప్రధానార్చకుడిగా నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు ఉద్యోగ విరమణ చేశారు.
వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం
మఠంపల్లి :మట్టపల్లి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామి నిత్య కల్యాణాన్ని సోమవారం వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విష్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాసన అనంతరం స్వామివారికి మాంగళ్యధారణ తలంబ్రాలతో కల్యాణాన్ని జరిపించారు .అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన, అర్చకుల పాల్గొన్నారు.
వైదిక కమిటీ నియామకం : ఈవో
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిత్య కైంకర్యాలు, పూజల్లో ఎలాంటి అంతరాయం ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైదిక కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు చెప్పారు. కొండపైన ప్రధాన కార్యాలయంలో సోమవారం కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పూజా విధానం, భక్తులకు దర్శనం కల్పించేందుకు వైదిక సిబ్బంది పనితీరు గ్రహించాలని కమిటీకి సూచించారు. పలు అంశాలను కమిటీ పరిశీలిస్తూ తగు సలహాలు, సూచనలు చేయాలన్నారు. నూతన వైదిక క మిటీ చైర్మనగా అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, డీఈవో దో ర్భల భాస్కరశర్మ, ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు, ప్రధాన పురోహితుడు గౌరిభట్ల సత్యనారాయణ, శివాలయం ప్రధానార్చకుడు నరసింహరాములు,వేద పండితుడు శ్రీనివాసశర్మ, ఏఈవో జూశెట్టి కృష్ణను నియమించారు.