శివకేశవులకు విశేష పూజలు
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:14 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి.
యాదగిరిగుట్ట, జూన్ 23(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభువు స్వామి, అమ్మవారికి వైష్ణవ పాంచ రాత్రాగమరీతిలో, పర్వతవర్థిని రామలి ంగేశ్వరస్వామి శివాలయంలో స్ఫటికమూ ర్తులకు శైవాగమశాస్త్ర రీతిలో నిత్య కైంక ర్యాలు నిర్వహించారు. ప్రధానాలయంలో సుప్రభాతసేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు, మూల మూ ర్తులను వేదమంత్ర పఠనాలు, పంచామృ తాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. పూజలు చేపట్టి సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం నిర్వహిం చారు. సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు కొనసా గాయి. శివాలయ ముఖ మండ పంలో స్ఫటికమూర్తులను అర్చకులు వేద మంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషేకించి ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.28,14,234ల ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్. వెంకట్రావు తెలిపారు. సమాచార హక్కు కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభులకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి అంతరాలయంలోనికి స్వయంభులను దర్శించుకోవాలని సైన్ బోర్టులు ఏర్పాటు చేశారు.
వైభవంగా మట్టపల్లి లక్ష్మీనరసింహుడి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో నరసింహుడి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవారు రాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత భక్తవత్సలునికి నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. ఆలయ సంప్రదాయ ప్రకారం ఆర్జిత కైంకర్యాలు నిర్వహి ంచారు. కల్యాణమూర్తులను పరిణయోత్సవ వేదికపైకి వేచేయించి పుణ్యాహవాచనం గావించారు. మాంగళ్యధారణ, యజ్ఘోపవీత ధారణలు అనంతరందివ్యమూర్తులకు గరుడోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదపండితులు తూమాటిరామాచార్యులు, కుమ్మరికుంట్ల బదరీనారాయణచార్యులు, లక్ష్మీనరసింహామూర్తి కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో సిరికొండ నవీన్ తదితరులు పాల్గొన్నారు.