Special Officer of Inkudu Ponds: ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారికి సత్కారం
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:03 AM
వాటర్‌బోర్డు జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా బోర్డులో ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి సత్యనారాయణను ఎండీ అశోక్‌రెడ్డి...
హైదరాబాద్ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): వాటర్‌బోర్డు జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా బోర్డులో ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి సత్యనారాయణను ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్‌లు సత్కరించారు. గురువారం ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఔటర్ పరిధిలో ఇంకుడు గుంతల నిర్మాణంలో సత్యనారాయణ క్రియాశీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి తెలిపారు. కాగా వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డిని గురువారం టీజీవో హైదరాబాద్ జిల్లా నాయకులు, కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్న నేపథ్యంలో ఎండీకి అభినందనలు తెలిపారు.