Share News

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:01 PM

శాంతిభద్రతల పరిరక్షణకు ప్ర త్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
ఠాణాలో రికార్డులను పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

మన్ననూర్‌, అక్టోబరు22 (ఆంధ్రజ్యో తి) : శాంతిభద్రతల పరిరక్షణకు ప్ర త్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. అమ్రా బాద్‌ మండలం మన్ననూరులో గల కృష్ణగిరి పోలీస్‌ ఠాణాను వార్షిక తనిఖీ లో భాగంగా బుధవారం ఆయన సం దర్శించారు. ఠాణాలో నమోదైన రికార్డు లను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచ నలు చేశారు. నేరాల అదుపునకు ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్‌ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అమ్రాబాద్‌ సీఐ శంకర్‌ నాయక్‌, కృష్ణగిరి ఎస్‌ఐ జయన్న పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:01 PM