Share News

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:10 PM

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్ర వారం జిల్లాలోని హాజీపూర్‌ మండలం పెద్దంపేట్‌ గ్రామపంచాయతీ పరిధిలోని కొ లాంగూడ గ్రామంలో మండల ప్రభుత్వ ఉద్యోగులచే సేకరించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు
గిరిజనులకు దుప్పట్లు అందజేస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

హాజీపూర్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్ర వారం జిల్లాలోని హాజీపూర్‌ మండలం పెద్దంపేట్‌ గ్రామపంచాయతీ పరిధిలోని కొ లాంగూడ గ్రామంలో మండల ప్రభుత్వ ఉద్యోగులచే సేకరించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం చలి తీవ్రత మరింత అధికంగా ఉన్నందున చలి ప్రభావిత ప్రాంతాలలో ప్రజల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటామని, హాజీపూర్‌ మండలం ప్రభుత్వ ఉద్యోగులు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని తెలిపారు. గ్రామంలోని 40 కుటుంబాల వారికి దుప్పట్లు అందజేశామని, చలి తీవ్రత అధికంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాలో పి.వి.టి.జిలకు 200కు పైగా ఇండ్లు అం దించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇంటి స్థలం కలిగి ఉన్నవారికి ఇల్లు నిర్మిం చుకునేందుకు ఆర్థిక చేయూత అందిస్తామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని, లబ్ధిదారులు వినియోగించుకోవాలని తెలిపారు. గిరిజన పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గిరిజన ప్రాంతా లలో అంతర్గత రహదారులు, తాగునీటి సమస్య లేకుండా అధికారుల సమన్వ యంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 11:10 PM