Share News

kumaram bheem asifabad- గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Nov 14 , 2025 | 10:04 PM

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి కలెక్టర్‌ హాజరై వారోత్సవాలను ప్రారంభించారు.

kumaram bheem asifabad- గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి కలెక్టర్‌ హాజరై వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 58వ జాయతీ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 19 వరకు వా రం రోజుల పాటు జిల్లాలో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనం, వక్తిత్వ పోటీ, చిత్రలేఖనం, వ్యాసరచన, ధ్యానం, వ్యక్తి త్వ అభివృద్ధి, పాటలు, రంగోలి, మెహందీ వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనాన్ని అన్ని హంగులతో పూర్తి పూర్తి సౌక్యాలతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అవసరమైన మెటీరియల్‌ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, లైబ్రెరియన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలి

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందంచాలని కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ఆసుపత్రి పర్యవేక్షకులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల సౌకర్యార్థం ఆర్‌వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రికి ప్రతి రోజు వైద్య చికిత్స కోసం ప్రజలు వస్తుంటారని, వారికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 10:04 PM