జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:11 PM
జిల్లాలో ప్రజల సంక్షేమం అభివృద్ధే లక్ష్యం గా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

కోటపల్లి, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రజల సంక్షేమం అభివృద్ధే లక్ష్యం గా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శని వారం మండలంలోని నక్కలపల్లి, బొప్పారం గ్రామాల్లో ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎ మ్మెల్సీ పురాణం సతీష్, మండల అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మండలంలోని నక్కలపల్లి పరిధిలో రూ. 7 లక్షల డీఎంఎఫ్‌టీ, రూ. 9 లక్షల సీఎస్ ఆర్, రూ. 5.5 లక్షల ఉపాధి నిధులతో సీసీ రహదారులు నిర్మిస్తున్నామన్నారు. కోట పల్లి నుంచి వేమనపల్లి వరకు రహదారి నిర్మాణంతో పాటు మండల పరిధిలోని ర హదారుల ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించా మని అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపిస్తామన్నారు. విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటి కి శుద్ధమైన నీటిని అందిస్తున్నామని, ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఇందిర మ్మ ఇండ్ల పథకంలో అర్హులకు పథకం ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. తహసీల్దార్ రాఘవేందర్‌రావు, ఎంపీడీవో లక్ష్మయ్య పాల్గొన్నారు.