నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:00 AM
చెన్నూరు నియో జకవర్గ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర కార్మిక, కర్మా గార, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నా రు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మం దిరంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, కలెక్టర్‌కుమార్ దీపక్‌లతో కలిసి అధికా రులతో సమావేశం నిర్వహించారు.
-మంత్రి వివేక్‌వెంకటస్వామి
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు నియో జకవర్గ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర కార్మిక, కర్మా గార, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నా రు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మం దిరంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, కలెక్టర్‌కుమార్ దీపక్‌లతో కలిసి అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ సాగులో భాగంగా రైతులకు యూరియా పం పిణీలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజా ఆరోగ్య,మున్సిపల్, ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన అభివృద్ధి పను లను త్వరగా పూర్తి చేసి నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. భీమా రం మండల కేంద్రంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రారంభానికి సిద్దం చేయాలన్నారు. అనంతరం గ్రామీణా భివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రైతులకు పనిముట్లు పంపిణీ చేశారు. అలాగే ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోడీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఎంహెచ్‌వో అనిత, అధికారులు పాల్గొన్నారు.